MNCL: ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని దండేపల్లి మండల కేంద్రంలో నిరసన తలపెట్టిన నేపథ్యంలో మంచిర్యాలలో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్ కుమార్, నాయకులు అశోక్ వర్ధన్, ముదాం మల్లేష్, రాజు, రాకేశ్ రేణ్వాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.