SRD: ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. కార్మికులను అకారణంగా తొలగించడం అన్యాయమని చెప్పారు. అనంతరం కలెక్టరేట్ ఇంచార్జ్ ఏవో దశరథ్కు వినతిపత్రం సమర్పించారు.