మేడ్చల్: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎంబీబీఎస్ సీటు సాధించిన వారికి ఫీజు చెల్లించడం అభినదనీయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా 13 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ. 5 లక్షల 21 వేల రూపాయల చెక్కుల పంపిణీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న బండారి లక్ష్మారెడ్డిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.