KMR: కామారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీలో కొందరు పారిశుధ్య కార్మికులు పని చేయకుండా వేతనాలు తీసుకుంటున్నారని, ఈ విషయమై మార్పు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల కార్మికులు, యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికులు నిబద్ధతతో పని చేయాలి అన్నారు.