NLG: విద్యార్థినిలు బాగా చదివి ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సైకిళ్ల వితరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.