WGL: పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సహకారం అవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఎవరు ఆందోళన చెల్లకూడదని సూచించారు.