MHBD: ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రచార కార్యదర్శి బోడ రాజు నాయక్ కి గతరాత్రి 11 గంటలకు తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పాము కాటు వేసింది. దీంతో పట్టణంలోని ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.