చిత్తూరు నగరంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులునిర్వహించారు. రామ్నగర్ కాలనీలో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమచారం రావడంతో 2టౌన్ CI నెట్టికంటయ్య తనసిబ్బందితో కలిసిదాడులు నిర్వహించారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మహిళలతోపాటు, ముగ్గురు విటులను స్టేషన్కు తరలించారు. అనంతరం కేసునమోదు చేశారు.