ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్ లో ఖనిజాల ఒప్పందంపై చర్చించడానికి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ చర్చలో వారిరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు దేశాధినేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కు అందజేస్తున్న సాయాన్ని తాజాగా అమెరికా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.