PPM: కురుపాం మండలంలోని పూతికవలస గ్రామానికి చెందిన మరపు శేషు అనే రైతు యొక్క రెండు ఎకరాల ఖర్బుజా పంటను శనివారం ఉదయం ఏనుగుల గుంపు నాశనం చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందివచ్చిన సమయంలో ఇలా ఏనుగుల వచ్చి నశనం చేశాయని రైతు వాపోయాడు. అటవీ శాఖ అధికారులు స్పందించి నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతు కోరుతున్నాడు.