NDL: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి తెలిపారు. శనివారం ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.