తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr)ఫై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Raja gopal reddy) సీరియస్ అయ్యారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సీరియస్ అయిన విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలు బీజేపీపై దుమ్మెత్తిపోశారు. అయితే.. ఆ తప్పు తాము చేయలేదని నిరూపించడానికి బండి సంజయ్.. యాదాద్రిలో ప్రమాణం కూడా చేశారు. ఈ విషయంపై కూడా కేటీఆర్.. బండి సంయ్ పై సెటైర్లు వేశారు.దీనిపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఒక బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ యాదాద్రి గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేస్తే.. సంప్రోక్షణ చేయాలని అంటారా? కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్రమ డబ్బు సంపాదించి మధమెక్కి ప్రవర్తిస్తున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అయ్యాకొడుకులు ఇద్దరికీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు రాజగోపాల్ రెడ్డి.