NLG: బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఎగుమతి అవుతున్న కోళ్ల వాహనాలను తెలంగాణ పోలీసులు, పశు వైద్య శాఖ అధికారులు గురువారం కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు నిలిపి తనిఖీలు నిర్వహించారు.