TG: రాష్ట్రంలో BRS పార్టీ BCల పేరుతో మరోసారి రాజకీయం చేయాలని చూస్తోందని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ MLA ఆది శ్రీనివాస్ ఆరోపించారు. గతంలో సర్వేలు నిర్వహించి నివేదికలు బయటపెట్టని BRS ఇవాళ కులగణనపై మాట్లాడుతుందని మండిపడ్డారు. BRS చెప్పిన కులగణనలో 51 శాతం BCలు ఉంటే తమ కులగణనలో 56 శాతం BCలు ఉన్నారని తెలిపారు. సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరుతామన్నారు.