కృష్ణా: ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని, 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. శనివారం విజయవాడ పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యాశాఖ అధికారులతో కలిసి పర్యటించారు.