విశాఖ నగర పరిధిలో జనవరి ఒకటో తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసిన నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఉదయం విశాఖ బీచ్ రోడ్డులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ మానవాళితో పాటు పర్యావరణానికి హాని కలిగిస్తుందని అవగాహన కల్పించారు. ప్రజలందరూ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను రక్షించాలన్నారు.