KRNL: తుగ్గలి మండలం చేపట్టిన ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని ఎంపీడీవో విశ్వమోహన్ ఆధికారులకు సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ సర్వే 80 శాతం పూర్తయ్యిందని.. మిగిలిన 20 శాతం సర్వేను ఈనెల 15వ తేదీ లోపు పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.