విజయనగరం జిల్లాలో మహత్మాగాంధీ, జాతీయ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న వేతనదారులంతా తమ గ్రామాల్లో వెంటనే పనులకు హాజరు కావాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లోని 775 పంచాయతీల్లో పనులు ప్రారంభించామన్నారు. ప్రతిరోజూ 300 వేతనం పొందేలా పని చేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యతా ఇవ్వలన్నారు.