అన్నమయ్య: షెడ్యూల్ కులాల వర్గీకరణపై వినతుల స్వీకరించేందుకు ఈనెల 20న రాజీవ్ రంజన్ మిశ్రాతో కూడిన ఏకసభ్య కమిటీ మదనపల్లె వస్తోందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏకసభ్య కమిటీ మదనపల్లెకు వచ్చిన సందర్భంలో ప్రజలు, ప్రజా సంఘాలు తమ వినతులను ఏకసభ్య కమిటీకి అందజేయవచ్చునని తెలిపారు.