ప్రధాని మోదీతో భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సమావేశమయ్యారు. ‘ప్రధాని మోదీతో ఇదే నా చివరి భేటీ. ఇక్కడికి నా కుటుంబంతో కలిసి రావడం సంతోషంగా ఉంది. మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కలిసి అమెరికా-భారత భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు పెంచారు. ఇరు దేశాల ప్రధానులకు, రెండూ దేశాల ప్రజలకు ధన్యవాదాలు’ అని తెలిపారు.