అన్నమయ్య: రాజంపేట మండలం మందపల్లి అరుంధతివాడలో శనివారం జరిగిన గౌరమ్మను సాగనంపే కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. గౌరమ్మకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు పాడే గొబ్బెమ్మ పాటలను ఆయన వీక్షించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని గ్రామస్థులకు అన్నం వడ్డించారు.