ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ బీజేపీ అధ్యక్షుడిగా ముద్దు మహేష్ ఎన్నికయ్యాడు. పొదిలిలో జరిగిన కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రిబోయిన చిన్నయ్య, జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాగులూరి రామయ్య, పందిటి మురళి పాల్గొన్నారు.