బాపట్ల: మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీశ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామివార్లు పర్చూరు రానున్నారు. పర్చూరులో నూతనంగా నిర్మించిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి సమేత అష్టలక్ష్మీ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం ఈనెల 31న జరగనుంది. ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆశ్రమ పీఠాధిపతులు రానున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.