ప్రకాశం: పాకాల బీచ్‌కు నాలుగు రోజుల పాటు పర్యాటకులు రాకుండా విరామం ప్రకటిస్తున్నట్లు సింగరాయకొండ సీఐ హజరత్తయ్య తెలిపారు. గత గురువారం బీచ్‌లో నలుగురు చనిపోవడంతో పాటు అలల ఉధృతి తగ్గకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా విరామం ప్రకటించినట్లు వెల్లడించారు. పర్యాటకులు బీచ్‌కు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.