TG: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి ఉత్తమ్ గుడ్న్యూస్ చెప్పారు. అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందేవరకు జారీ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కులగణన, పాత రేషన్ కార్డుల జాబితా ఆధారంగా.. కొత్త కార్డుల జారీకి ప్రాథమిక జాబితా రూపొందించినట్లు తెలిపారు. ఇందులో పేరు లేనివారు గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.