BPT: రాష్ట్రవ్యాప్తంగా సహ చట్ట ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్ శామ్యూల్ జోనాథన్ పిలుపునిచ్చారు. శనివారం బాపట్లలో ద్విదశాబ్ది ఉత్సవాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ.. సహ చట్టం నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.