NLR: నగరం రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం దేవేరుల సమేత రంగనాథుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రంగనాథస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.