GNTR: గుంటూరు బొంగరాల బీడులోని రైల్వే డిపోలో సోమవారం ఉదయం భోగి పర్వదిన వేడుకల్లో భాగంగా భోగి మంటలు వేసి సందడి చేశారు. డిపో జనరల్ పీటీ. నాయక్ మాట్లాడుతూ.. పాత సంవత్సర సమస్యలు పోయి కొత్తగా అన్ని సవ్యంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ ఇంఛార్జ్ కోటేశ్వరరావు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దాూర్ యూనియన్ ప్రైమ్ మెంబర్ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.