VSP: పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మధురవాడ హరితా అపార్ట్మెంట్లో ఆదివారం ఓ మహిళ మేడ పైనుంచి జారి పడి మృతి చెందింది. కొంజేటి సుధ(57) మధురవాడలో ఉంటున్న పెద్ద కుమారుడు ఇంటికి వచ్చింది. సుధా గత కొంతకాలంగా బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు ఆదివారం మేడ పైనుంచి జారి మృతి చెందింది.