GNTR: తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సోమవారం పట్టణంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ముత్తెంశెట్టిపాలెంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి శివకుమార్ పాల్గొని, ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వైయస్ఆర్ జగనన్న కాలనీల పేరు మారుస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.