కృష్ణా: హంసలదీవి బీచ్ వద్ద సముద్ర స్నానం చేసేటప్పుడు పర్యాటకులు జాగ్రత్త వహించాలని మెరైన్ సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి హంసలదీవి బీచ్ వద్దకు వచ్చిన పర్యాటకులకు మెరైన్ సిబ్బంది తగు సూచనలు, సలహాలు అందించారు. సముద్ర తీరం వెంబడి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెరైన్ ఎస్ఐ పూర్ణ మాధురి, పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహించారు.