BPT: యధార్థమైన బుద్ధుని ధాతువు అయిన భట్టిప్రోలు స్థూపం అత్యంత ప్రాచీన చారిత్రక స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శాసనాల రీత్యా ఈస్థూపం క్రీ.పూ.4-3 శతాబ్దాల అశోకుడి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈస్థూపం చక్రాకార పథం కలిగి ఉంటుంది. భట్టిప్రోలులో లభ్యమైన అవశేషాలన్నింటిలోనూ బండరాయి పెట్టెలపైన లిఖించిన శాసనాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.