W.G: సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. ప్రజల జీవితాలకు, సమాజ శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందన్నారు. కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.