E.G: నర్సరీ రైతుల సమస్యలపై నేషనల్ హార్టికల్చర్ కమిషనర్ డాక్టర్ ప్రభాత్ కుమార్కు కడియం మండల నర్సరీ అసోసియేషన్ సభ్యులు, రైతులు వినతి పత్రం అందజేశారు. శనివారం ఆయన స్థానిక నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన పరిష్కారానికి హామీ ఇచ్చారు.