AKP: సంక్రాంతి పండగ పురస్కరించుకుని పేకాట, జూదం, తదితర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇటువంటి కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.