ASR: కాఫీ పండ్ల సేకరణ లక్ష్యాలు సాధించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పాడేరు ఐటిడిఏ పిఓ వి. అభిషేక్ హెచ్చరించారు. శనివారం ఐటీడీఏ కార్యాలయంలో అరకు నియోజకవర్గం మండలాల కాఫీ ఏఈవోలు, ఫీల్డ్ కన్సల్టెంట్లు, హార్టికల్చర్ కన్సల్టెంట్లతో ఆయన కాఫీ పండ్ల సేకరణపై సమావేశం నిర్వహించారు. ఈనెల 20వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు.