ASR: పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. శనివారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు 10 పర్యాటక బోట్లలో 640 మంది పర్యాటకులు వెళ్లారని, వారందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చినట్లు టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. ఉదయం వెళ్లిన బోట్లు గోదావరి నదిలో విహారయాత్ర అనంతరం సాయంత్రం 5 గంటలలోపు గమ్యస్థానానికి చేరుకుంటాయని తెలిపారు.