HYD: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై జూబ్లీహిల్స్‌లోని నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.