NLG: బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ భరోసా ఇచ్చారు. నేరడుగొమ్ము మండలం పేర్వాల గ్రామానికి చెందిన గాదం నారయ్య బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని పొందారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మంజూరైన రూ.2లక్షల చెక్కును శనివారం నారయ్య కుటుంబానికి అందజేశారు.