ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం రాచర్ల మండలంలో పర్యటిస్తున్నట్లుగా గిద్దలూరు టీడీపీ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. రాచర్ల మండలం గౌతవరంలో శనివారం ఉదయం 11 గంటలకు గోకులం షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కావున మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు.