KNR: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఈదులగట్టపల్లి సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మానకొండూర్ మండలం పెద్దూరుపల్లికి చెందిన శ్యామల, సంపత్‌ల పెద్ద కుమారుడు అజయ్ డిగ్రీ వరకు చదివి ఓ వాహన షోరూంలో పనిచేస్తున్నాడు. గురువారం కరీంనగర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో అజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు.