బాపట్ల: నియోజకవర్గంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలు అన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తుందని నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ అన్నారు. బాపట్ల మండలం కొండుబోట్లపాలెం గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ షాలిమ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.