ATP: గుత్తి పురపాలక పింఛన్దారులకు జనవరి 1వ తేదీ పంపిణీ చేసే పింఛన్లను డిసెంబర్ 31వ తేదీ ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సోమవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నూతన సంవత్సరం సందర్భంగా పింఛన్లను ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నామన్నారు.