మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. దాదాపు ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించినట్లైంది.