కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్ మైదానంలో ఈ రోజు నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల రిహార్సల్స్ ఏర్పాట్లను ఎస్పీ జి. బిందుమాధవ్ పరిశీలించారు. పరీక్షల నేపథ్యంలో పాల్గొనే పోలీసు అధికారులు, కొంత మంది యువకులతో ఆయన రిహార్సల్స్ నిర్వహించారు. పోలీసు అధికారులకు, సిబ్బందితో సమావేశమై పకడ్బందీగా, నిర్వహించాలని ఆదేశించారు.