W.G: గోపాలపురంలోని ఆదివారం అర్ధరాత్రి SBI ఏటీఎంను గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేశారు. ఎవరూ లేని సమయంలో రాయితో ఏటీఎం ధ్వంసానికి పాల్పడ్డారు. వెంటనే సైరన్ మోగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆగి మందలించే క్రమంలో దుండగులు పరారయ్యారు. స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.