SKLM: కవిటి మండలంలోని రాజపురం సబ్ స్టేషన్ పరిధిలోని భైరిపురం 11కెవి ఫీడర్ పరిధిలో విద్యుత్ స్తంభాలు మార్పులు కారణంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఈఈ జి.యజ్ఞేశ్వరరావు తెలిపారు. అందులో భాగంగా భైరిపురం, నెలవంక, కలసుకుద్ది పంచాయతీల పరిధిలోని గ్రామాలకు, రాజపురంలోని శ్రీశయణ వీధికి విద్యుత్ సరఫరా నిలుపు చేస్తామన్నారు.