కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం ఉదయం 10 గంటలకు మంగళగిరి వెళతారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగే సమీక్షా సమావేశంలో వర్ల పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా, నియోజకవర్గ ప్రజలు ఏదైనా అత్యవసర సహాయం కోసం పామర్రులోని టీడీపీ కార్యాలయంలో సంప్రదించవచ్చని సూచించారు.