GNTR: ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుందని, లేకపోతే సోమవారం నుంచి తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్పైన ప్రవేశం ఉండదని అధికారులు తెలిపారు. కొంతకాలంగా రహదారులపై జరిగే ప్రమాదాలలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలే ప్రమాదానికి గురవుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు.