PLD: పెదకూరపాడు మండలం జలాలపురం గ్రామంలోని చెరువు కట్టమీద జూదమాడుతున్న 8 మందిని ఎస్ఐ గిరిబాబు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఎస్ఐ మాట్లాడుతూ.. జూదమాడే వారిపై చర్యలు తీసుకుంటామని, యువతకు సూచనలు, సలహాలు ఇచ్చారు.